సంగారెడ్డి: అమీన్ పూర్ లోని 455 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మండల రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆరై రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.