హైదరాబాద్ పఠాన్ చేరు : బతుకమ్మ పండుగ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. మహిళలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, కమిషనర్ సుజాత, తహసిల్దార్ విజయకుమార్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
