అనంతపూర్ జిల్లా : గుత్తి ఎంపీడీవో కార్యాలయం నందు మండల స్థాయి బాల్యవివాహాల నిరోధక కమిటీ సమావేశమును ఎంపీడీవో చిట్ర. శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్యవివాహాలను లేని మండలంగా ప్రకటించాలని దానికి ప్రతి ఒక్క అధికారి, పౌరులు కృషి చేయాలని కోరారు .
గ్రామీణ స్థాయి నుండి బాల్య వివాహాల నిర్ములన గ్రామీణ స్థాయి కమిటీల ద్వారా నివారించవచ్చని బాల్యవివాహాల వలనే కలిగే అనర్ధాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా మాతృ మరణాలు, శిశు మరణాలు అధికం అవుతాయి .
కావున తల్లిదండ్రులు బాలిక విద్యను ప్రోత్సహించి బాలికలను రక్షించాలని పేర్కొన్నారు.
బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయని ప్రోత్సహించడం నేరమని చేసినవారికి చేసుకున్న వారికి,సహకరించిన వారికి అందరికీ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా విధించబడతాయి అని తెలిపారు.
అలాంటి బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నారాయణ నాయక్ తహసిల్దార్ ఎస్ మహబూబ్ బాషా ఐసిడిఎస్ సి డి పి ఓ నాగమణి ఎంఈఓ రవి నాయక్ మెడికల్ ఆఫీసర్ దేవేంద్ర ఏ ఎస్ ఐ రామచంద్రారెడ్డి కోఆర్డినేటర్ చైల్డ్ లైన్ 10 98 బాలాజీ పంచాయతీ సెక్రెటరీలు మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులు , ఏఎన్ఎంలు, హౌసింగ్ మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.