వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల ఎమ్మార్వో ఆఫీసు వెనుక జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల గ్రామానికి చెందిన చిమ్మట సీతారావమ్మ(68) ఈరోజు ఉదయం కూలీ నిమిత్తం మిర్చి కోతకు గణపవరం వెళ్ళింది పని చేస్తున్న క్రమంలో ఎండవేడికి తట్టుకోలేక ఆకస్మికంగా ఊపిరి ఆడక మరణించింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు ఆకస్మికంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు పిడిఎం అధ్యక్షులు కే శ్రీనివాసరావు, ఎం సి పి ఐ పలనాడు జిల్లా అధ్యక్షులు కృష్ణ తదితరులు సందర్శించి సమాజం పట్ల సేవా దృక్పథం కలిగిన మృతురాలు చిమ్మట సీతారావమ్మ కుటుంబం కడుపేదరికంలో జీవిస్తున్నారు సంత ఇల్లు కానీ ,సెంటు భూమి కానీ లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తులు క్రింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పక్కా ఇల్లు తోపాటు ఆర్థికంగా ప్రభుత్వమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.
