contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

త్వరలో ఏపీ సినీ పరిశ్రమ నుండి కాంగ్రెస్ పెద్దలను కలవనున్న అల్లు అరవవింద్ .. మరి తెలంగాణ సినీ పరిశ్రమ నుండి ఎవరు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. నేడు గానీ, రేపు గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనిపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషదాయకమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే చిత్ర పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొత్త కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని, ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రోత్సాహం అందిస్తుందని భావిస్తున్నామని అల్లు అరవింద్ వివరించారు.

తెలంగాణ సినీ పరిశ్రమ ఎవరు లేరా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణ వచ్చి పదేళ్లయినా తెలంగాణ బిడ్డల అణచివేత తగ్గలేదని, తెలంగాణ యూనియన్లను కూడా అణచివేతకు గురి చేసి నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రబుత్వ పెద్దలను కలవనున్నారా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఏది ఏమైనా తెలంగాణ బిడ్డలు మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :