తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం గమనార్హం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం (ఇప్పటి బీఆర్ఎస్) హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు.
సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.
కాగా టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు రాజీనామా చేసారు. పదవి విరమణ తరువాత కూడా అయన టాస్క్ ఫోర్స్ ఆ ఎస్డీగా అయన పని చేసారు. నోటిఫికేషన్ తరువాత ఎన్నికల కమీషన్ రాధాకిషన్ రావును టాస్క్ ఫోర్స్ నుండి తప్పించి. పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, ఐఏఎస్ లను బారసా ప్రభుత్వం అదే శాఖలో నామినేటెడ్ పదవుల్లో కొనసాయించింది. ఇప్పుడు, వీళ్ళ పని తీరుపై గతంలో రేవంత్ రెడ్డి పలు మార్లు విమర్శలు చేసారు. అయితే ప్రస్తుతము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం తెలిసిన సంగతి విని ఒక్కక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు. సాయంత్రం లోపు మరికొంతమంది రాజీనామాలు చేసే అవకాశముంది.
తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ లు భయపడి ఒక్కొక్కరికి రాజీనామాలు మొదలు పెట్టారు. రాజీనామాలు లేఖలను ఒక్కొక్కరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పంపిస్తున్నారు. రాజీనామా లేఖలు పంపినవారు వీరే .. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస యాదవ్, పల్లె రవి కుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడే రాజీవ్ సాగర్, డా. ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్య నాయక్, మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి తో పాటు మరికొందరు ఉన్నారు.