మాచర్ల ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఐజీ త్రివిక్రమ వర్మతో పాటు అదనపు బలగాలను మాచర్లకు పంపామని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదని, అవాంఛనీయ శక్తులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీజీపీ హెచ్చరించారు.
