కరీంనగర్ జిల్లా: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండు నందు ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కోతి శ్రీనివాస్ (27) పాల్గొని రక్తదానం చేసారు. అయితే చేపలు పట్టుట , దినసరి కూలిగా గల శ్రీనివాస్ తన భార్య(24) ఇద్దరు పిల్లలు అయిన కొడుకు ప్రియాన్స్ (5), కూతురు ఆద్య (1) లతో సహా కుటుంబ సమేతంగా గన్నేరువరం నుండి కరీంనగర్ పోలీసు కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి చేరుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి వారిని తన కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.