ఆంధ్రప్రదేశ్ : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనిఖీల పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారాలకు ఆదేశించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అంత వరకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు పట్టుబడితే దాన్ని జప్తు చేసి ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వివిధ శాఖల మధ్య పరస్పర సమాచార మార్పిడి, సమన్వయం కోసం ప్రత్యేకమైన యాప్ త్వరలో తీసుకువస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.