అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన కిశోర వికాసం కార్యక్రమం సిడిపిఓ ఢిల్లీశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, గుత్తి సీఐ వెంకటేశ్వర్లు గుత్తి ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు రమ్య తేజ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలోని బాలల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకై పోలీస్ మరియు మునిసిపల్ శాఖ ల నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి గుత్తి మండలాన్ని బాలల స్నేహపూర్వక మండలం చేస్తామని తెలిపారు బాలల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడతున్న ఈ మధ్యకాలం లో బాలల పై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందాన్నారు.
బాలల పై లైంగిక వేధింపులు నిరోధానికి ఫోక్సో యాక్ట్ ద్వారా శిక్షలు పడతాయని వాటిని నిర్భయంగా పోలీసులకు తెలపాలన్నారు ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అయితే ఆ సమాచారం ఒక రోజు ముందుగా మనకు సమాచారం వస్తే, మనము అక్కడికి వెళ్లి మనం బాలికలు,వరుడు తల్లి తండ్రుల వద్దకు వెళ్లి వారితో చర్చించి బాల్య వివాహాల కారణంగా జరిగే అనర్ధాలు, చట్టపరంగా పడే శిక్షలు,వారికి జరిగే నష్టాల వివరాలు తెల్పినట్లైతే వారిలో మార్పు వచ్చి సంఘటనలు జరుగకుండా నిరోధించిన వారము అవుతాము అని తెల్పారు. పోలీస్ శాఖ తరుపున తాము కూడా బాల్య వివాహాల నిరోధించడానికి పూర్తిగా సహక రిస్తామని, రక్షణ కల్పిస్తామని తెల్పారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు