కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కే.రామయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి సేవలను కొనియాడుతూ మహిళలను ఏ విధంగా చైతన్య పరిచిందో, మహిళలకు విద్య ఎంత అవసరమో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.