అనంతపురం జిల్లా గుత్తి మునిసిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో గుత్తి మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సహకార మద్దతుతో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందులో భాగాంగా ప్రభుత్వం వారికి మునిసిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు చేసుకుంటున్న విన్నపాలు..
1.మునిసిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లకు జి.ఓ నెం.36 ప్రకారం జీతాలు అమలు చేయాలి
2.జీతాల పెంపు విషయమై 12వ పి.ఆర్.సి ని సుప్రీం కోర్టు తీర్పు మేరకు అమలు చేయాలి.
3.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
4.మునిసిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
5.మునిసిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
6.వర్కర్ల రిటైర్మెంట్ వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి
7.ఎక్స్ గ్రేషియా అమలు చేయాలి
8.వర్కర్ మరణానంతరం దహన సంస్కారాలకు రూ.20000 అందించాలి.
పైన తెలిపిన ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల న్యాయపరమైన మరియు గత 10 సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల ప్రార్థన ప్రభుత్వం వారికి తెలియజేసేందుకు మీ సహాయ సహకారాలుతో సహకరించాలని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో గుత్తి మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగము, పారిశుధ్య విభాగం యూనియన్ల నాయకులు రాజా,మురళి,రాజ్ కుమార్,రవిశంకర్, నరసింహ,ఆదినారాయన,నక్కా శేఖర్, సూర్యనారాయణ, రామాంజనేయులు, మహేష్,సుంకన్న,బాలరంగడు మరియు ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మునిసిపల్ వర్కర్ల సమస్యల రిలే నిరాహారదీక్ష కు మద్దతుగా నిర్మల సిఐటియు మండల కార్యదర్శి, రామకృష్ణ రైతు సంఘం నాయకులు సహకార మద్దతు తెలిపారు.