అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జాతీయ బాలిక దినోత్సవం ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వనజ అక్కమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ర్యాలీ గా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి.వనజ అక్కమ్మ మాట్లాడుతూ ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంపొందించుకొని విద్యా, ఆరోగ్యం మొదలైన రంగాల్లో బాలికలు మరింతగా చురుగ్గా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బాలికలు తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ముందుకు అడుగులు వేయాలని అన్నారు. బాలికల సంరక్షణ హక్కులు ఆరోగ్యం విద్య పోషకాహారం శారీరక ఎదుగుదల కు ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో బాలికలు మహిళల పట్ల హత్యాయత్నం కేసులు ఎక్కువగా నమోదు కావడం చాలా విచారకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలపై స్త్రీలు విద్యార్థి దశ నుండే ఎదుర్కొనడం అలవాటుగా మారాలని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా శిశు, మహిళ సంరక్షణకు పాటుపడాలని ఆమె తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన భేటీ బచావో- బేటి పడావో, సుకన్య సమృద్ధి యోజన పథకాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. తదనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు ఈ కార్యక్రమంలో డి సి పి ఓ మంజునాథ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజయలత వెంకటేశ్వరి 1098 జిల్లా కోఆర్డినేటర్ కృష్ణమాచారి డబ్ల్యూ కమలాక్షి గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ నాగేశ్వరి, శ్రీదేవి, గౌరీ, కరాటే మాస్టర్ యోగా నందు బాలికలు తదితరులు పాల్గొన్నారు.
