- టీటీడీలో శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ పేరుని రద్దు చేసి సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్ గా పేరు మార్చే ప్రయత్నంలో టిటిడి ఉన్నట్టు ఆంతర్యం ఏమిటో ఏడుకొండలవాడికే ఎరుక ?
- అధికార పార్టీ నాయకులకు కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పిచేందుకే శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ ని ప్రక్షాళన
పేరుతో అంధ కారంలోకి నెట్టే ప్రయత్నమా - శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నా టిటిడి
- ఉద్యోగుల పొట్ట కొట్టిన ఏ ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి రాలేదు జాగ్రత్త
- ఇప్పటికైనా టిటిడి ఉన్నతాధికారులు ఆలోచించి శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ మార్పు విషయంలో పాత పద్ధతినే అవలంబించాలని ఉద్యోగులు కోరిక
- కార్పొరేషన్ విషయంలో ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల పక్షాన నిలబడాలంటున్న కార్పొరేషన్ ఉద్యోగులు
టీటీడీలో శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ పేరుని రద్దు చేసి సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్ గా పేరు మార్చే ప్రయత్నంలో టిటిడి ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిన్న ఉద్యోగుల బతుకులతో ఆటలాడుకోవద్దంటున్న ఉద్యోగులు. టిటిడిలో కొంతమంది అధికార పార్టీ నాయకులకు కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పించి వారి ద్వారా టిటిడిలో థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఏజెన్సీల నియామకాలను చేపట్టేందుకు, టీటీడీలో ఉన్న శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ ని ప్రక్షాళన పేరుతో వేలాదిమంది ఉద్యోగుల భవిష్యత్తును అంధ కారంలోకి నెట్టేందుకు టీటీడీలో పెద్దకుట్ర జరుగుతోందని కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు నిర్ణయాలతో కార్పొరేషన్ ఉద్యోగులకు రక్షణ లేకుండా చేసే ప్రయత్నంలో టిటిడి పాలకమండలి ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే:
గత ప్రభుత్వ హయాంలో ఔట్సోర్సింగ్ సొసైటీలు /ఏజెన్సీలో/ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే చర్యలో భాగంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏపీ కార్పొరేషన్ (ఆప్కో)కి అసెంబ్లీలో సపరేట్ బడ్జెట్ పెట్టి ఆమోద ముద్ర వేశారు. దానికి అనుగుణంగా టీటీడీలో గత ప్రభుత్వ పాలకమండలి ఐఏఎస్ లతో కమిటీ వేసి శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ ని ఏర్పాటుచేసి అందులోకి టీటీడీలో పనిచేస్తున్నటువంటీ ఔట్సోర్సింగ్ సొసైటీలు /ఏజెన్సీలో/ కాంట్రాక్టు ప్రాతిపదిక పైన పనిచేస్తున్నటువంటి దాదాపు 10000 పదివేల మంది ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత కల్పించడం కొరకు టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శ్రీలక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ లో చేరిన ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. పే స్కేలు ఫిక్స్ చేసి వీరికి లడ్డు కార్డు, దర్శనం కార్డు అన్ని సౌకర్యాలు పర్మనెంట్ ఎంప్లాయిస్ కు ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని కూడా కల్పించారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా గత పాలకమండలిలో తీర్మానం చేసి తెలియపరిచారు.
ప్రస్తుతం ఉన్న పాలకమండలి శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ (ఎస్ఎల్ఎస్ఎంపీసీ) ను రద్దుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కార్పొరేషన్ ఉద్యోగంలో ఆందోళన మొదలైంది. ఇకపై దీని ద్వారా ఎలాంటి నియామకాలూ చేపట్టకూడదని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో మాత్రమే నియామకాలు చేపట్టాలని తీర్మానించిందని దీంతో.. ఇప్పటికే కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవితవ్యం అగమ్య గోచరంగా మారనుందని కార్పొరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా టిటిడి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి 10,000 పదివేల మంది కుటుంబాల జీవితాలు వీధిన పడే పరిస్థితి ఉంది. ఉద్యోగుల పొట్ట కొట్టిన ఏ ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి రాలేదనీ కొంతమంది ప్రజా సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి కార్పొరేషన్ ఉద్యోగుల జీవితాలను కాపాడాలని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దీనిపైన స్పందించి చొరవ తిసుకొని ప్రస్తుతం ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ని యధావిధిగా కొనసాగించి అందులో మార్పులు చేర్పులు చేయకుండా ఉండాలని కార్పొరేషన్ ఉద్యోగులు కోరుచున్నారు.