అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లో15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాసిల్దారు డి ఓబులేసు ఆధ్వర్యంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులతో స్థానిక తాసిల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ర్యాలీ నందు ఓటు జన్మ హక్కు, బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న తదితర నినాదాలతో ర్యాలీ గా గాంధీ చౌక్ వద్ద కు చేరుకొని మానవహారం చేపట్టి , ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది దేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి విధిగా ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ లలిత, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ సూర్యనారాయణ శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందీప్, కళాశాల సిబ్బందితోపాటు, రెవెన్యూ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
