తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాల తాసిల్దార్ కార్యాలయం నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు రెవిన్యూ సిబ్బందిచే ర్యాలీ తాసిల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో, ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ శనివారం ప్రిన్సిపాల్ మొహిద్దిన్ భాష, కళాశాల సిబ్బందిచే నిర్వహించారు. విద్యార్థులచే మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా పాకాల తాసిల్దార్ సంతోష్ సాయి మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు పాకాలలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. 18సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛాయుత,నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, ఎటువంటి ఒత్తుడలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, 17సంవత్సారాలు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నుపురస్కరించుకొని పాకాల తాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ను శాలువా కప్పి ప్రముఖులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిటి కళ్యాణ్, జూనియర్ అసిస్టెంట్ వినోద్, వి.ఆర్.ఓలు చక్రపాణికృష్ణ పిళ్ళై, నిరోష, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
