గత ఆరు దశాబ్దాలుగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ పేదరిక నిర్మూలనకు పేదల ఉన్నత విద్యాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణాల కొరకు, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ ఎనలేని సేవలందిస్తున్న ఆర్ డి టి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం నిధుల ను మంజూరు కాకుండా నిరసిస్తూ గుత్తిఆర్ఎస్ లోని పత్తికొండ రోడ్డు లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి రైల్వే స్టేషన్ రోడ్డులో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వందరోజుల నుండి ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు ఆర్డిటి సంస్థ పై నిషేధం ఎత్తివేయాలని ఆర్డిటి సంస్థలు కాపాడుకుందాం అని ఎఫ్ సి ఆర్ ఏ నిధుల విడుదలకు ప్రభుత్వ వెంటేనే చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్తలు గద్దల మస్తానప్ప , గద్దల నాగరాజు, వైయస్సార్ సిపి నాయకులు జిఎం భాషా, భీమ లింగప్ప, మహిళా సంఘం నాయకురాలు గద్దల జయమ్మ, మందల నాగరాజు, పులి ఈశ్వరయ్య, స్టోర్ డీలర్ మస్తాన్, అరుణ్, ఆదినారాయణ, ఆర్డిటి సి డి సి మెంబర్లు నరసింహులు, ఆర్ డి టి స్కూల్ టీచర్లు రంగయ్య, అంజలి, రామకృష్ణ, లచ్చన్ పల్లి మస్తానప్ప ,తిరుపాలు తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఆర్డిటి సంస్థ ప్రతినిధులు మహిళలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
