వేటపాలెం : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గుంటూరు జీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఇవాళ సముద్ర స్నానానికి వచ్చారు.ఓ ప్రైవేటు రిసార్టు ఎదురుగా వీరు సముద్ర స్నానానికి దిగగా.. అలల ఉద్ధృతికి అందులోని నలుగురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ టి.శ్రీకాంత్, ఎమ్మెల్యే కరణం బలరాం ఆదేశాల మేరకు అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.