contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిరంజీవి ‘బాస్ వస్తున్నాడు’ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఖరారు

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళి సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ దీపావళికి మనం ‘మాస్ మూలవిరాట్’ కు స్వాగతం పలుకుదాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. “బాస్ వస్తున్నాడు… పూనకాలు లోడింగ్” అంటూ మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తించేలా ట్వీట్ చేసింది.

కాగా ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇదే ఖరారవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :