భద్రాచలం : తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీష్‌ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను బెజ్జి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో డివిసిఎంగా భాద్యతలు నిర్వహిస్తున్న మడకం మాసతో పాటు మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. గుర్తించిన ఆరుగురి మావోయిస్టులపై 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు సుక్మా ఎస్పీ తెలిపారు. దంతేశ్ పురం, నగారాం, కొర్రాజుగూడ అటవీప్రాంతంలో జరిగిన ఘటన స్థలం నుండి AK-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, బర్మాడ్ తో పాటు పది ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో పై విజయం సాధించినందుకు భద్రతా బలగాలు బెజ్జి పోలీస్ క్యాంపులో డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.