contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యువమోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సెప్టెంబర్ 14 :తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంలో భాగంగా బుధవారం భద్రాచలం అసెంబ్లీ కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ నల్లూరి ఉదయభాస్కర్ రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి తెలంగాణ గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 200 సంవత్సరాలు పైగా పరిపాలించడం జరిగిందని అన్నారు ఎందరో మహానీయులు ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ వారిని తరిమేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం వచ్చేనాటికి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలు నిజం పరిపాలనలలో 530 సంస్థానాలు నిజం ఆధీనంలో ఉండేవి అని అన్నారు .ఈ సంస్థానాల్లో తెలంగాణ ప్రజలు కప్పం కట్టలేక పేద ప్రజల ను నిజం దోపిడికి గురి చేస్తూ తెలంగాణ ఆడపడుచులను అవహేళన చేసే విధంగా నిజం పరిపాలన చేసారని అన్నారు . నిజం పరిపాలనను అంతం చేయడానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 1948 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు పోలీస్ చర్యలో భాగంగా సంస్థానాలలో చుట్టూ పోలీస్ బలగాన్ని ప్రయోగించడం చూసిన నిజం పరిపాలకుడు ఏడవనిజం నవాబు మీరు ఉస్మానిఖాన్ పోలీస్ చర్యకు భయపడి లొంగిపోయి తలదించుకొని 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ సంస్థానాన్ని నిజాం సంస్థానాన్ని విలీనం చేయడం జరిగిందని అన్నారు. ఈ విలీన సందర్భంగా నాడు ఒక హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడి ..భాష ప్రయుక్త రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతం గా ఏర్పడి నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలించి తెలంగాణ ప్రాంతానికి సొమ్మును కాజేసి వెనుకబడిన ప్రాంతంగా తెలంగాణ ప్రాంతం నిలిచిందని అన్నారు . ఈ సమయంలోనే 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమై స్థానికులు స్థానికేతరకు మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమంలో 365 మంది ప్రాణ త్యాగాలు చేసి మలిదశ ఉద్యమంలో 1250 మంది ప్రాణ త్యాగం చేసిన తెలంగాణను సాధించుకుంన్నాం అని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటినుండి తెలంగాణ బ్రతుకులు బంగారు బ్రతుకులు అని చెప్పిన కెసిఆర్ విద్యుత్ బిల్లులు పెంచి ఆర్టీసీ చార్జీలు పెంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు బిల్లులు పెంచి సామాన్య ప్రజల మీద భారం వేసి ప్రశ్నించే గొంతుకను గొంతు మూసి ఆనాడు నిజం పరిపాలన చేసే విధంగా నేడు కెసిఆర్ ఒక నిజం నవాబుగా పరిపాలన చేస్తున్నాడు రాబోయే రోజులలో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి గోల్కొండ గడ్డమీద కాషాపు జెండా ఎగురవేసి బిజెపి అధికారంలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంజా ధర్మ, జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, జిల్లా యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, యువ మోర్చా భద్రాచలం మండల అధ్యక్షులు అన్నం హరీష్, భద్రాచలం మండల అధ్యక్షులు ములీిశెట్టి రామ్మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శిలు చెల్లుబోయిన వెంకన్న, అల్లాడి వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు, కుంజర్ల ముక్తేశ్వరరావు, గడ్డం శ్రీహరి, సూరత్ సుదర్శన్, షేర్ శ్రీనివాస్, మండల కార్యదర్శి అన్నం సత్యనారాయణ సీనియర్ నాయకులు PC కేశవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు పేరం ఉపేందర్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు క్రాంతి బాబు, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి జయరాజు, చర్ల మండల అధ్యక్షులు నక్క కన్నయ్య, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు తెల్లం శేఖర్, పట్టణ యువమోర్చా నాయకులు అన్నం సాయి లక్ష్మణ్, మణికంఠ,ఫణి, చెల్లుబోయిన వాసు, సాయి, మనోజ్, గిరీష్, మహమ్మద్, ముత్యాల నిఖిల్, సత్య, రమేష్, సూర్య, దుర్గ, పండు, దుమ్ముగూడెం చర్ల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :