తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పై, నారా లోకేష్ పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేసి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో సీఐ కొడాలి నాని పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చెయ్యడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా, పోలీసులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరగడంతో కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చెయ్యకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండల కన్వీనర్లు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ,వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, టౌన్ మరియు మండలంలోని అన్ని వార్డులకు, గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొనడం జరిగింది.