కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి మెండయ్య తాను పండించిన ధాన్యాన్ని తూకం వేసి రాత్రి వేళలో బస్తాల ప్రక్కన నిద్రించాడు, ఈ తెల్లవారుజామున లోడుతో ఉన్న ట్రాక్టర్ మిల్లుకు వెళ్లవలసిందిగా ఉండగా పక్కనే నిద్రిస్తున్నటువంటి ఉప్పులేటి మెండయ్య పరదలు కప్పుకొని ఉండడంతో కానరాని ట్రాక్టర్ డ్రైవరు, మెండయ్య మీద నుంచి తీసుకెళ్లడంతో మెండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ మృతి పట్ల గ్రామ సర్పంచ్ ఉప్పులేటి ఉమారాణి త్రీవ దిగ్బంధం వ్యక్తపరిచారు. ఈ మధ్య వరుస మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయని అన్నారు.
