కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ సారథ్యంలో జరిగింది, ఈ కార్యాక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ బసవరాజు సారయ్య, బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు పాల్గొని మాట్లాడారు ప్రతి కార్యకర్తకు అండగా వుండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని కార్యకర్తలే పార్టీకి బలం బలగం అని అన్నారు. బిజెపి – కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు. పేదలకు సాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం అని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అన్నారు. పేదలు, రైతుల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పార్టీలకతీతంగా ప్రతి గడపగడపకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న దేశంలో ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు,రైతులకు రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు వంటి నగదు బదిలీ పథకాలతో పాటు సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణాలు, స్మశాన వాటికలు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు మన ఊరు – మనబడి మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పార్టీ పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతంలో అధికారంలో ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు కర్ణాటక ప్రాంతంలో అమలు కావడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పుట్టిన బిడ్డ నుంచి చావుకు కాలు చాపే వృద్ధుల వరకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ ఆత్మ గౌరవంగా జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర ప్రాంతాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై సవతి ప్రేమ చూపించడం జరుగుతుంది.
ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించాలని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో వివిధ రకాల వేషాలతో గ్రామాలలో వచ్చి కులాల,మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి మీరు. వారు చెప్పిన మాటలు వింటే అభివృద్ధిలో మన గ్రామాలు మరో 20 సంవత్సరాలు వెనక్కి పోతుందని, కాబట్టి తప్పుడు మాటలు వినకుండా వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలన అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొన్నారు.
