- సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ వలసలు.
- 100 మంది నేతలు, కార్యకర్తలు డా. రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరిక.
సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సమక్షంలో సోమవారం బేగంపేట తలారి వాని పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ కి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా డా. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ “బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని,కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు.. బీఆర్ఎస్ విధానం మూడు పంటలకు కరెంటు అని, అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రైతు వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, బిజెపికి బుద్ధి చెప్పాలని, రైతు బాంధవుడైన కెసిఆర్ని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని,దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు జరుగుతున్నాయని’ తెలిపారు
చేరిన వారిలో రాజా బాబు, అన్నాజి వెంకటేష్(చిన్న),మెరుగు రజనీకాంత్,కొరివి అమర్,పవన్, ప్రవీణ్,కర్న సంపత్, సపిల్, సుంకే రమేష్, ఎలా రాంబాబు,బిట్ల సాయి, దేవరాజు, భోజ అశోక్, ఎలా రాజు, ఎలా శ్రీకాంత్, సుంకే బాబు, వెన్న అఖిల్, అక్షయ్,అనిల్,పబ్బతి రజినీకాంత్, సాగర్,శ్రీను, తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్,మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్త,సర్పంచ్ చింతల పల్లి సంజీవ రెడ్డి,రావుల మొండయ్య,పెంటమీది శ్రీనివాస్, వంకాయల సరిత నరేష్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,నాయకులు ఎలుక దేవయ్య, ఎర్రవెల్లి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు బిగుళ్ల మోహన్, బిగుళ్ల సుదర్శన్, మేకల శ్రీకాంత్, పోట్లపెల్లి శివ,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు బెజ్జంకి క్రిష్ణ,కనగండ్ల సురేష్, బెజ్జంకి శేఖర్ కొరివి తిరుపతి( కెటిఎమ్ ) కొరివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.