BHAKTHI TELANGANA

ఖైర‌తాబాద్‌లో ఈ సారి 50 అడుగుల మ‌ట్టి వినాయ‌కుడు

ఈ ఏడాది ఖైర‌తాబాద్‌లో ఆవిష్కరించ‌నున్న గ‌ణేశుడి ప్ర‌తిమ‌కు సంబంధించిన న‌మూనాను ఖైత‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ ద‌ఫా 50 అడుగుల ఎత్తుతో రూపొందించ‌నున్న ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పూర్తిగా మ‌ట్టితోనే నిర్మితం కానున్నాడు. ఇప్ప‌టిదాకా ఏర్పాటైన వినాయ‌క ప్ర‌తిమ‌ల‌న్నీ ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో రూపొందిన‌వే. అయితే తొలిసారి ఖైర‌తాబాద్ గ‌ణేశుడు పూర్తిగా మ‌ట్టితోనే రూపొంద‌నున్నాడు. మ‌ట్టి గ‌ణప‌తుల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ పిలుపుతోనే ఈ ద‌ఫా మ‌ట్టి వినాయ‌కుడి ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు […]

BHAKTHI NATIONAL

కాశి ఆలయ చరిత్ర

కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.  కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.  క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం  క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన  క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం  క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు  క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ […]

BHAKTHI

నాంచారమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం కరాలపాడు గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు తిరునాళ్ళలో సిడిమాను ఊరేగింపులో శ్రీ గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి , దేవస్థాన ట్రస్టీ మద్దసాని రమణరెడ్డి , సర్పంచ్ చల్లా శివారెడ్డి , Mptc అనుబోతుల గురవ రెడ్డి, కరాలపాడు PACS మాజీ సర్పంచ్ సత్తార్ సీతారామిరెడ్డి ,యార్డు డైరెక్టర్ మద్దసాని రమణరెడ్డి , వైసిపి మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చింత సుబ్బారెడ్డి, […]

BHAKTHI

భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల లో ఇక టోకెన్లు లేకుండానే సర్వదర్శనం

తిరుమల : సర్వదర్శనం టోకెన్ల కోసం మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో రెండున్నర నెలలపాటు ఎస్ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇచ్చామని, దీనివల్ల గ్రామీణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించామన్నారు. దీంతో మార్చి 1 నుంచి ఏప్రిల్ 11వ […]

BHAKTHI

వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లింలు…

ఇవాళ శుభకృత్ నామ సంవత్సరాది కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ కనిపిస్తోంది. భక్తులతో ఆలయాల్లో కోలాహలం నెలకొంది. కాగా, ప్రతి ఉగాదికి ముస్లింలు వెంకటేశ్వరస్వామిని దర్శించడం ఒక్క కడప జిల్లాలోనే చూస్తాం. తిరుమల క్షేత్రానికి దారితీసే ప్రాచీన మార్గానికి తొలి గడపగా కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. ఉగాది పండుగ రోజున ఈ ఆలయానికి ముస్లింలు పోటెత్తుతారంటే అతిశయోక్తి కాదు. గత వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. తాజాగా శుభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని […]

BHAKTHI

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా ‘నిచుళాపురి’ దర్శనమిస్తుంది. ‘తిరుచ్చి’ సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ మనవాళ పెరుమాళ్ పేరుతోనూ .. అమ్మవారు వాసలక్ష్మీ పేరుతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి ‘కల్యాణ తీర్థం’ పరమ పవిత్రమైనదిగా చెబుతారు. పూర్వం ధర్మవర్మ అనే రాజుకు స్వామివారు దర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ధర్మవర్మ తన భార్య నిచుళాదేవి పేరుతో ఈ ఊరును […]

BHAKTHI

మైలారం శ్రీమల్లికార్జున స్వామి ని దర్శించుకున్న భక్తులు

  కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ శివార్లలోని ఆదివారం  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నిజామాబాద్ జిల్లా వేల్పుర్ మండలం  సీతరంపూర్ గ్రామము నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అలాగే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ సమీపంలో మహిళలు మల్లన్న పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు తీర్చారు దీంతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కిటకిటలాడింది నిజామాబాద్ జిల్లా వాసులు మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో […]

BHAKTHI

ప్రతి సంవత్సరం పరిమాణంలో పెరిగే నంది శిల్పం..

  నంది పరిమాణం పెరుగుతున్నందున ఆలయ సిబ్బంది ఇప్పటికే ఒక స్తంభాన్ని తొలగించారు. ప్రజలు గతంలో దాని చుట్టూ ప్రదక్షిణాలు (రౌండ్లు) చేసేవారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధృవీకరించింది శ్రీ #యగంటి ఉమా మహేశ్వర ఆలయం కర్నూలుజిల్లా, #రాయలసీమ,ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయాన్ని 15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగమ రాజవంశం రాజు హరిహర బుక్కరాయ నిర్మించారు. ఇది వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది. పెరుగుతున్న నంది ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం నిరంతరం […]

BHAKTHI

విజయాన్ని ప్రసాదించే వెన్నవరం శ్రీరాముడు

శ్రీరామచంద్రుడు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా ‘వెన్నవరం’ కనిపిస్తుంది. వరంగల్ జిల్లా .. డోర్నకల్ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. వెన్నవరంలో .. వెలసిన వేంకటేశ్వరస్వామి వున్నాడు. స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. అక్కడికి చాలా దగ్గరలోనే సీతారామాలయం వుంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. కాంపల్లి అప్పయ్య అనే ఒక భక్తుడికి స్వప్నంలో స్వామివారు కనిపించి, తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట. దాంతో ఆయన గ్రామస్థులకు […]

BHAKTHI

ఆపదల నుంచి గట్టెక్కించే నెమలి వేణుగోపాలుడు

శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ‘నెమలి’ ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. శ్రీకృష్ణుడికి నెమలి అంతే ఎంతో ప్రీతి .. ఈ కారణంగానే ఆయన తన శిరస్సున నెమలి ఈకను ధరించేవాడు. అలా తనకి ఎంతో ఇష్టమైన నెమలి పేరుతో ఏర్పడిన గ్రామంలోనే స్వామి ఆవిర్భవించడం విశేషం. స్వామివారిని దర్శించడం వలన, ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ధర్మబద్ధమైన కోరికలు స్వామివారి అనుగ్రహంతో తొలగిపోతాయని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఆయన […]