నల్సార్ పత్రికా ప్రకటన :అందరికీ అన్నం పెట్టే రైతులకు చట్టాన్ని చుట్టం చేసేందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. దుక్కి దున్నే దగ్గరనుండి పండిన పంట అమ్ముకునే దాకా రైతులకు అనునిత్యం చట్టాలతో అవసరం పడుతుంది. రాష్ట్రంలో సాగు చట్టాలు రెండు వందలకు పైగా ఉన్నాయి. ఈ చట్టాలపై రైతులకు కొంత అవగాహన, అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించే అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయ సేవలను […]
Uncategorized
మళ్లీ తగ్గిన గ్యాస్ ధర … కానీ… మీకు కాదు
అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో దేశంలో గ్యాస్ ధరలు తగ్గాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర సోమవారం రూ.36 తగ్గింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రూ 2012.50 నుంచి రూ. 1,976కి దిగిందని ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలిపారు. ముంబైలో రూ. 1972.50గా […]
అమిత్ షాతో ఈటల భేటీ..
తెలంగాణ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించడం… ఇటీవలే తెలంగాణకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించడం.. వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ […]
చైనాకు ఒక్కంగుళం భూభాగాన్ని కూడా వదిలేది లేదు: ఆర్మీ నూతన చీఫ్ మనోజ్ పాండే
లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్ గా బాధ్యతలు అందుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సైన్యం వైఖరిని స్పష్టం చేశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడున్న స్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించబోమని, తమ వైఖరి ఇదేనని ఉద్ఘాటించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. తమ సన్నద్ధత […]
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … తెలంగాణలో వయో పరిమితి పెంపు
తెలంగాణ ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలు కాగా… తాజాగా నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు వయో పరిమితిని మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని రకాల ఉద్యోగాలకు కాకుండా కేవలం యూనిఫాం ఉద్యోగాలకు మాత్రమే ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు చెందిన […]
పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్ … ఖర్కివ్‌లోని భారత విద్యార్థులు వెంటనే వీడాలంటూ హెచ్చెరికలు
నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నేడు (బుధవారం) ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాలే ఉక్రెయిన్ ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్న ఖర్కివ్‌లోని భారత విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పును వెల్లడించింది. పుతిన్‌తో ఫోన్ సంభాషణ ముగించిన వెంటనే మోదీ విదేశాంగ శాఖ అధికారులను అలెర్ట్ చేశారు. ఖర్కివ్‌పై రష్యా దళాలు విరుచుకుపడనున్నాయని, వీలయినంత త్వరగా అక్కడి మన విద్యార్థులను బయటకు తీసుకెళ్లాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగానే నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్‌లోని […]
ఎపి హైకోర్టు ఆదేశాలతో అయ్యన్నపాత్రుడికి ఊరట
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి కాసేపటిక్రితం ఊరట లభించింది. అకారణంగా పోలీసులు తన అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆ పిటిషన్లో ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా […]
డా.బి.ఆర్. అంబెడ్కర్ గెలిచిన నియోజకవర్గాన్ని పాకిస్తాన్ లో కలిపేసింది కాంగ్రెస్ పార్టీనా ???
బాబా సాహెబ్ అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనపుడు భారతదేశంలో గల పీడిత ప్రజల సమస్యలపై తన వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. భారత జాతీయులందరికి కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రతినిధి, మీ యొక్క ప్రాతినిధ్యం అవసరం లేనే లేదు అని అంబేడ్కర్ గారిని తిరస్కరించింది. అంబేడ్కర్ తీవ్రంగా పట్టుబడితే, బలహీనవర్గాలకు మాత్రమే మీరు ప్రతినిధిగా వ్యవహరించండి మిగిలిన వారి తరపున కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది, ఈమాత్రం కూడా కాంగ్రెస్ కు […]
‘వినాయక చవితి’కి రానున్న ‘అఖండ’! … త్వరలో షూటింగు పార్టు పూర్తి
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలాఖారు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాను కూడా దసరా కానుకగా అభిమానులకు అందించాలని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ‘ఆర్ […]
ఈ నెలాఖరుకు థియేటర్లు ఓపెన్
ఏ నిర్మాత కూడా తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమా బిజినెస్ లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేం. కరోనా కారణంగా ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. అదే సమయంలో నిర్మాతలూ దెబ్బతిన్నారు. కాబట్టి సినిమాల విడుదల విషయంలో ఎవరి నిర్ణయం […]