కరీంనగర్ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలను గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధుల అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంచ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని,అందుకే ఉమ్మడి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా
తీర్చిదిద్దారన్నాను. బాబు విజన్ 2020 అద్భుత ఫలితాలను ఆవిష్కరించిందని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో విప్లవ్మాక మార్పులు చోటుచేసుకున్నాయని కొనియాడారు. విజన్,ముందుచూపు ఉన్న చంద్రబాబు సేవలు తెలుగురాష్ట్రాలకు చారిత్రక
అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు కళ్యాడపు ఆగయ్య,ఎడ్ల వెంకటయ్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, పార్టీ నాయకులు గంగాధర కనకయ్య, గంగాధర జ్యోతి, సాయిల్ల రాజమల్లయ్య, రొడ్డ శ్రీధర్, ఎర్రవెల్లి రవీందర్,అవుదుర్తి విజయ్ కుమార్, బోలుమల్ల సదానందం, ఎలిమిల్లి కిషన్, సందబోయిన రాజేశం, తాటికొండ శేఖర్, ఆకుల కాంతయ్య, వేముల రాజేశం, ఎర్రవెల్లి వినీత్,మిట్టపల్లి శ్రీనివాస్, ఎస్ రామేశ్వర్రెడ్డి, ప్రభాకర్, జలీలొద్దీన్, ఉల్లెందుల నర్సయ్య, మేకల
రాయమల్లు,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
