కరీంనగర్ జిల్లా: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశములో చిగురుమామిడి మండల జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ పలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖా మాత్యులు గంగుల కమలాకర్ ముఖ్య అతిధిగా హాజరై సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వికలాంగుల సర్టిఫికెట్ల జారీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్లాట్ బుకింగ్ మరియు సదరం క్యాంపుకు ఎక్కువ సమయమిచ్చి, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేలా సరళీకృతం చేయాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య పనులు నిర్వహించే స్క్రావెంజర్ కు కనీసం 5 వేల జీతమివ్వాలని, మన ఊరు మన బడి కార్యక్రమంలో సుందరగిరి ప్రహరీ గోడ నిధులు 19 లక్షల ఈజీఎస్ రద్దు అయ్యాయని, ఆ నిధులు యధావిధిగా మంజూరు ఇస్తూ పనులు కొనసాగేలా చూడాలన్నారు. పల్లె ప్రక్రుతి వనాలు ఎండ తీవ్రతకు ఎండిపోయే అవకాశమున్నందున నీటి సదుపాయం కల్పించి తగిన చర్యలు చేపపట్టాలన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించుటకు, రోడ్లపై దుమ్ము ధూళిని తొలగిస్తూ సమగ్ర పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పిల్లలు, యువకులు కార్డియాట్రిక్ సమస్యలతో హఠాత్తుగా చనిపోతున్నారని విచారం వెలిబుచ్చుతూ, భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా విద్యార్థి దశనుండి హెల్త్ ప్రొఫైల్ తయారుచేయాలన్నారు.
