కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్. మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని ఈరోజు ఉదయం ఆయన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీవి. రామకృష్ణా రావు తో కలిసి సందర్శించారు. అనంతరం కళ్యాణాలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం చెంజర్ల గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇటీవల ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందగా, మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రసమయి పరామర్శించి తమ సానుభూతి తెలిపారు.
