
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కష్టపడి సంపాధించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని.. ఇప్పుడు మరోసారి తెరపైకి తెచ్చారు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి కొత్త ప్రభుత్వంలో మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలంటూ.. ట్విట్టర్ లో సియం రేవంత్ రెడ్డి ని కోరారు. ప్రతి రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సియం రేవంత్ రెడ్దకి గుర్తు చేస్తూ ట్వీట్ చేయటం ద్వారా సోషల్ మీడియా లో ఈ విషయం పై భారీ స్పందన ఏర్పడింది.
వి.సుధాకర్ మాట్లాడుతూ .. గత ప్రభుత్వం డిఎస్పీ నళిని గుర్తుపెట్టుకోలేదు. కనీసం సియం రేవంత్ రెడ్డి ని నళిని కి న్యాయం జరిగేలా చూడాలని కోరానని, అందుకు స్పందించిన సియం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.
@TelanganaCMO @revanth_anumula@BhattiCLP
తెలంగాణ సాధన కోసం తన DSP ఉద్యోగానికి రాజీనామా చేసి … ఉద్యమంలో పాల్గొన్న శ్రీమతి నళిని సోదరిని, తెలంగాణ వచ్చినతరువాత కేసీఆర్ కాక గుర్తుపెట్టుకోలేదు. కనీసం సియం రేవంత్ రెడ్డి గారు శ్రీమతి నళినికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. pic.twitter.com/VUm7JXCx5P— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) December 13, 2023
వివరాల్లోకి వెళితే …
నా అన్నా తమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ‘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తన డీఎస్పీ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశారు దోమకొండ నళిని. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు కూడ కూర్చున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనిపించకుండా పోయారామె
‘నా అన్నా తమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ‘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తన డీఎస్పీ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశారు దోమకొండ నళిని. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు కూడ కూర్చున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనిపించకుండా పోయారామె. మళ్లీ ఇప్పుడు నళిని పేరు బాగా వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నళిని పోస్టింగ్ విషయంపై స్పందించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం (డిసెంబర్ 15) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా నళిని పోస్టింగ్ ప్రస్తావనకు రాగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే నళిని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల తాను పోలీస్ ఉద్యోగం చేయలేనంటూ చెప్పినట్లు తెలుస్తోంది.
@TelanganaCMO@revanth_anumula@BhattiCLP@TelanganaDGP
మాజీ డిఎస్పీ నళిని విషయంలో స్పందించిన సియం రేవంత్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.https://t.co/8Owa8cKDSZ— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) December 16, 2023










