పల్నాడు జిల్లా : గురజాల పట్టణ పరిధిలో ని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని ప్రశ్నించారు. విధుల్లో సక్రమంగా లేని సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని ఆసుపత్రి డి.సీ.ఓ డాక్టర్ లక్ష్మీ ని ఆదేశించారు. ఆసుపత్రి లో వైద్యం కోసం వచ్చిన కొందరు రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పై ఆరా తీశారు. ఆసుపత్రిని పరిశుభ్రం గా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో సక్రమంగా పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేద ప్రజలకు నిరంతరం డాక్టర్ లు అందుబాటులో ఉండి సేవలను అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత లేకుండా చూస్తామని అన్నారు . మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి డాక్టరు ను జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ లో ఆరోగ్య మిత్రా ద్వారా పేదలకు అందుతున్న వైద్య సేవలను రికార్డుల్లో పరిశీలించారు. ఆసుపత్రికి రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారు. ఏ విధంగా వైద్యం చేస్తున్నారని డాక్టర్లను ప్రశ్నించారు. ఆసుపత్రిలో ప్లోరింగ్ పనులు నాసిరకంగా ఉండటంతో పనులు చేయించిన ఏ. ఇ కి నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలోని టెస్టింగ్ ల్యాబ్ ద్వారా రోగులకు అందుతున్న ఫలితాలు ఎలా వస్తున్నాయని టెక్నీషియన్ ను ప్రశ్నించారు. ఫిజియథెరపీ సేవలపై వైద్యుని తో మాట్లాడారు. గురజాల రెవెన్యూ డివిజన్ చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి ఆరోగ్య సమస్యలతో వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డాక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట గురజాల ఆర్.డి.ఓ అద్దెయ్య. తహశీల్దార్ శివ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గురజాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి డి.జీ.ఒ డాక్టర్ లక్ష్మీ, డాక్టరు సందీప్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
