కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మల్లారెడ్డిపై రేవంత్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మల్లారెడ్డిని జైల్లో పెడతామని అన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ ఒక బట్టేబాజ్ అని, లుచ్చా అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ జీవితం అంతా బ్లాక్ మెయిలింగేనని అన్నారు.
మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే తన కాలేజీలను మూసేయిస్తానని రేవంత్ బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కూతురి పెళ్లిని తన డబ్బులతో చేశాడని చెప్పారు.