సంగారెడ్డి జిల్లా : అత్యవసర సమయంలో మనము అందించే సిపిఆర్ ప్రథమ చికిత్స ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలి.. జిల్లా ఎస్పీ శ్రీ. యం. రమణ కుమార్ అన్నారు .
ఈ రోజు పోలీస్ కళ్యాణ మండపంలో ఎస్పీ ఆదేశానుసారం వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో పోలీస్ సిబ్బందికి సి.పి.ఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్డియోపల్మనరీ రిసేసిటేషన్ మరియు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్(CPR & AED) వచ్చినప్పుడు మరియు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, చేయాల్సిన సపోర్ట్ మరియు ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. రోహిత్ మరియు మనుజ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఎవరైనా యాక్సిడెంట్స్ గురైనప్పుడు అత్యవసర సమయంలో ఏమి చేయాలో చాలామందికి తెలియదని, ఆ గోల్డెన్ హవర్ లో వారిని సి.పి.ఆర్ తో చాలావరకు బ్రతికించవచ్చన్నారు. మొదటగా చేయవలసిన ప్రథమ చికిత్స వ్యక్తి భుజం తట్టి గట్టిగా పిలవాలి, యొక్క హార్ట్ బీట్ ఉందో లేదో చెక్ చేసి, అంబులెన్స్ కు సమాచారం అందించాలి. అనంతరం ఆ వ్యక్తిని సమతల నేలపై పడుకోబెట్టి ఛాతిపై మన రెండు అరచేతులతో నొక్కుతూ నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ఇలా రెండు మూడు సార్లు చేయడం వలన రక్త ప్రసరణ జరిగి జీవం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సంధర్భంగా డి.యస్.పి బాలాజీ గారు మాట్లాడుతూ ఎవరైనా హార్ట్ ఎటాక్ ఫిట్ట్స్ కరెంటు షాక్ మరియు యాక్సిడెంట్ కు గురైనప్పుడు అత్యవసర సమయంలో మనము అందించే సి.పి.ఆర్ ప్రథమ చికిత్స ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలం అని సిబ్బంది ప్రతి ఒక్కరికీ సి.పి.ఆర్ పై అవగాహన తప్పనిసరి అన్నారు. ఎక్కువగా ప్రమాదాలకు గురైన వెంటనే గాయపడ్డ వారికి మానసిక ధైర్యం కల్పించడంకోసం మనం సపోర్ట్ గా వుంటూ ఫ్రథమ చికిత్స అందించి అంబులెన్స్ కు సమాచారం అందించాలని డి.యస్.పి అన్నారు.
కార్యక్రమంలో ఎ.ఆర్ డి.యస్.పి జనార్ధన్, డి.సి.ఆర్.బి సి.ఐ. రమేష్, ఆర్.ఐ. లు కృష్ణ, డానియెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
