చైనా 132 మందితో వెళ్తూ కుప్పకూలిన బోయింగ్ 737 విమానం బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో మొత్తం రెండు బ్లాక్‌బాక్స్ లు ఉన్నాయి. అందులో ఒకటి కాక్‌పిట్‌లో ఉండగా, రెండోది తోక భాగంలో ఉంది. ఇప్పుడు లభ్యమైంది కాక్‌పిట్‌లో అమర్చిన బ్లాక్‌బాక్స్‌గా గుర్తించారు. ఇది బాగా తిన్నట్టుగా అధికారులు తెలిపారు.
దీనిని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా, విమానంలోని 132 మందిలో ఒక్కరి జాడ కూడా తెలియకపోవడంతో వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు.