బెంగళూర్ లోని శ్రీ శ్రీ ఆయుర్వేదిక్ కళాశాలలో ఈ నెల 16 నుంచి 22 వరకు ఏడు రోజుల పాటు జరిగిన జాతీయ సమైక్యతా శిబిరానికి వి ఎస్ యు నుంచి పది మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు ఒక ఎన్ ఎస్ ఎస్ ప్రొగ్రమ్ అధికారి పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్న వారిని ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి గారు ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయంకు దేశ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మంచి పేరు తీసుకురావాలని కోరారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ వారం రోజుల్లో జాతీయ సమైక్యతా శిభిరం లో వాలంటీర్లు నేర్చుకున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్రి ఆచార్య యం చంద్రయ్య గారు రిజిస్ట్రార్ డా. ఎల్ వి కె రెడ్డి గారు ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా. బి వెంకట సుబ్బయ్య , ప్రొగ్రమ్ ఆఫీసర్, విస్సావోదయా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్గొన్నారు.