తెలంగాణ స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 24వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందించనుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఈ అల్పాహారం అందిస్తారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజున ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయమే వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పథకాన్ని తీసుకు వస్తున్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
