ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ ఆదేశాల మేరకు గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికుడు రంగ సహకారంతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు నెలవారి వైద్య పరీక్షలకు విచ్చేసిన గర్భవతులకు అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న వెంకటేశులు, పాటేల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, వెంకటపతి నాయుడు, బసినేపల్లి రంగా, మిద్దె ఓబులేష్, మురళి నాయక్, హసేన్ భాష, ధనుంజయ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.