నాగర్ కర్నూల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు జ్ఞాన వికాస భారతి సంస్థవారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి మహాగణపతి అంటూ స్వచ్ఛతాహే సేవా కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా .. వెయ్యి గణపతులను జిల్లా కేంద్రంలో వచ్చిన ప్రజలకు వితరణ చేసారు. దాతలను ప్రోత్సహిస్తూ మట్టి గణపతిని పెట్టుకున్న అసోసియేషన్ సంస్థలను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించుటకు మట్టి గణపతి మహా గణపతి సెల్ఫీ కాంటెస్ట్ ద్వారా బహుమతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన వికాస భారతి ఉపాధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్, జనరల్ సెక్రెటరీ సుధారాణి, ప్రచార కార్యదర్శి సురేందర్, సభ్యురాలు జ్యోతి గౌడ్, సునందనాచారి పాల్గొన్నారు.