సిద్దిపేట జిల్లా : కోహెడ మండలంలోని నకిరే కొమ్ముల గ్రామానికి చెందిన బుర్ర రాజుగౌడ్ ఇటీవల తాడి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు రాజును బుధవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి టిపిసిసి, ఓబిసి రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద విషయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని నష్టపరిహారాన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. గీత కార్మికులు నిత్యం ప్రాణాలతో చెలగాటమాడే వృత్తిలో ఉన్నారని గాలి దుమారం వచ్చినప్పుడు చెట్లు ఎక్కకపోవడమే ముఖ్యమని జాగ్రత్త సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్, బోయిని అశోక్, మండల నాయకులు వేముల వీరేశం, గూడ స్వామి, నకిరే కొమ్ముల గ్రామ శాఖ అధ్యక్షులు సుంకరి సారయ్య, దొంగల ప్రతాపరెడ్డి, మేడిచర్ల సంపత్, బుర్ర వెంకటస్వామి, వెల్దండ తిరుపతి, మామిడి శ్రీకాంత్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
