జగిత్యాల జిల్లా , మెట్ పల్లిలో నిన్న కిడ్నాప్ కు గురైన బాలుడిని జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పాడి సీసీ పుటేజ్ ధ్వారా నిందుతున్నీ గాలించి 24 గంటల్లోపే కేసును చేదించారు. మెట్ పల్లి DSP కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నప్ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మెటుపల్లి పట్టణంలోని దుబ్బవాడ ఏరియాలో నిన్న సాయంత్రం జరిగిన రెండు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కేసును సీసీ పుటేజ్ ధ్వారా ఛేదించడం జరిగిందన్నారు. బాలుడి అక్కకు 20 రూపాయలు ఇచ్చి షాపులో ఏదైనా కొనుక్కోమని చెప్పి బాలుడిని దుండగుడు టూ విల్లర్ వాహనంపై ఎత్తుకెళ్లాడని బాలుడి అక్క చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి బాలుడిని రక్షించామని తెలిపారు. నిందుతుడు ఇస్లావత్ నాగేష్ బాలుడిని ఇతరులకు విక్రయించడానికి కిడ్నప్ చేశాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.