యువతకు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ భారీగా ఉద్యోగ (Jobs), ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, రాజకీయ నాయకులు జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని హుజూర్ నగర్ ఎమెల్యే శానంపుడి సైదిరెడ్డి, TASK-RISE ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ జాబ్ మేళాను ఈ నెల 28న ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 7 ప్రముఖ సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
జాబ్ మేళాలో పాల్గొను సంస్థలు:
1.Techouts – IT Services and Product Company
2. TATA Sky-Telecom
3.Apollo Pharmacy-Pharma
4.ACT FiberNet-Telecom
5.Navatha-Logistics
6.People PRIME,
7.RotoMaker Animation
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, బీఏ, బీఎస్సీ, బీఈ/బీటెక్, బీబీఏ, ఎంఎస్సీ, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఐటీఐ/డిప్లొమా, గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. 2017, 2018, 2019, 2020, 2021, 2022 లో ఉత్తీర్ణత సాధించిన యువతీ, యువకులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ పై బేసిక్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు నిర్వాహకులు
అభ్యర్థులకు ముఖ్య గమనిక: అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు. పాస్ ఫొటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూలను నిర్వహించు స్థలం: టౌన్ హాల్, హుజూర్ నగర్ (సాయిబాబా గుడి దగ్గర), నిర్వహించు తేదీ: 28-09-2022, ఉదయం 9.30 గంటలకు
-అభ్యర్థులు ఏదైనా సమాచారం కోసం 9866499007, 9985846860 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.