జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు చుక్కల.పార్ధసారథి (కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ), పెళ్లకూరు.సాత్విక (జగన్స్ డిగ్రీ కాలేజీ) మరియు పి.వెంకట చైతన్యను(కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ)లను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు సిటీ శాసనసభ్యులు మరియు మాజీ నీటిపారుదల శాఖా మాత్యులు డా. పి అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు.
నెల్లూరు విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించటం గర్వంగా ఉందన్నారు. డా, పి అనిల్ కుమార్ యాదవ్ గారు NSS వాలంటీర్లను అభినందిస్తూ విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు.
వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో తన వంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఉపకులపతి, ఆచార్య జి యం సుందరవల్లి గారికి, రిజిస్ట్రార్ డా. పి రామచంద్ర రెడ్డి గారికి , ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ను మరియు కృష్ణ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం కృష్ణా రెడ్డి గారిని అలాగే పి చంద్ర శేఖర్ రెడ్డి గారిని అభినందించారు.