అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు మాత్రమే వచ్చాయని, కానీ మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి 7 సీట్లు, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్న బీజేపీ సీట్లను, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అసంతృప్తులను కలిపితే తమకు 56 సీట్లు అవుతాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని, కానీ కేసీఆర్ సింహంలా వస్తారన్నారు. సమయం చెప్పలేం.. కానీ మిత్రులతో కలిసి తమ స్థానాలు 56కు చేరుకుంటాయని చెప్పారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే వేటకు సిద్ధమైనట్లే అన్నార్. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని, ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.