కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామములో యూనిసెఫ్ ఆధ్వర్యంలో జెడ్ పీ హెచ్ స్ లో జరిగిన అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంలో బాల్యం నుండే పిల్లల్లో స్వచ్ఛంద సేవా భావం, వెల్లి విరియాలని తమ కుటుంబం తమ వారు, ఇరుగుపొరుగువారు అందరితో కలిసి ఉండి, ప్రేమానురాగాలు ,ఆత్మీయత పెంపొందించుకోవాలని విద్యార్థిని, విద్యార్థులకు డిఇఓ ఉద్బోధించారు. యు ఎన్ వెలెంటర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యతోపాటు,సమాజం, సామాజిక చైతన్యం తదితర అంశాలను పిల్లలకు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఫిబ్రవరి నాటికి చదువులో మంచి ప్రతిభ చూపిన 10వ తరగతి పిల్లలకు తగు ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి మాట్లాడుతూ, ఈ దశలో తమ వంతుగా నీరు, విద్యుత్ శక్తి పొదుపు చేయడం పరిశుభ్రత పాటించేలా చేయడం, మొక్కలు నాటి సంరక్షించడం లాంటి మంచి సేవా కార్యక్రమాలు పాల్గొనాలని పిల్లలకు సూచించారు. సర్పంచ్ శారద , ప్రధానోపాధ్యాయులు శారద మాట్లాడుతూ, పిల్లల్లో నైతిక ప్రవర్తన పెంపొందించుకోవాలని కోరినారు. పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ చదువు ద్వారానే మంచి పౌరులుగా ఎదగవచ్చునని త్రివిధ దళాల్లో గల ఉద్యోగ అవకాశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఫెసిలిటేటర్ రవీందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.