కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: కాగజ్నగర్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన తరచూ బురద నీరు ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యపై రిపోర్టర్ టీవీ గురువారం ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు.
మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిశీలించారు. వెంటనే చర్యలు చేపట్టి అక్కడి నాలాను శుభ్రం చేసి బురద నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా నివారించారు. దీంతో స్థానికులు కొంతవరకు ఉపశమనం పొందారు.
అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్యపై స్పందించి నాలాను శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం – నరకప్రాయంగా మారిన రైల్వే ఓవర్ బ్రిడ్జి రహదారి








