కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ లో రాజమాత జిజియా బాయి జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మాతృ మూర్తి వీరమాత రాజమాత జిజియా బాయి చత్రపతి శివాజీని మహారాజుగా తీర్చిదిద్ది మార్గదర్శిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని, జిజియా బాయి ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించేవారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
