కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య గురువారం తొలగించినట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 143లో ప్రభుత్వ భూమిలో మున్సిపల్ నైట్ షెల్టర్ కోసం కేటాయించబడిన ప్రదేశంలో కొన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ భూమిలో బేస్ మెంట్, రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్ మరియు రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ, “ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల జనం మరియు ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినగలవు. అందువల్ల ఎవరూ ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదు. ఈ విధంగా నిబంధనలు ఉల్లంగించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు నియంత్రించడంలో స్థానిక అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.