- గోల్డ్ మెడల్ సాధించిన శ్రీనివాస్
- వెండి పతకం సాధించిన ఎస్సై శశిధర్
- రజత పతకం సాధించిన పరుశురాం
కరీంనగర్ జిల్లా: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్ పోలీసులు సత్తా చాటారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడోత్సవాల్లో భాగంగా 20 కిలోమీటర్లు స్లైకింగ్ విభాగంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బంగారు. రజత పథకాలు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గోనెల శ్రీనివాస్ బంగారు పథకం సాధించగా, సైబరాబాద్ ఐటీ సెల్ ఎస్సై శశిధర్ వెండి పథకం, కరీంనగర్ కమిషనర్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పరుశురాం రజత పథకం సాధించారు. పోటీల్లో గెలుపొందిన పోలీస్ క్రీడాకారులకు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతితో పాటు నిర్వాహకులు పథకాలు అందజేశారు. సత్తా చాటిన కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులను సిపి అభిషేక్ మహంతి ప్రత్యేకంగా అభినందించారు.
పరుశురాం ను అభినందించిన గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న రజత పథకం సాధించిన పరశురామును గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ ప్రత్యేకంగా అభినందించారు.