వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా బీఆర్‌ఎస్ పరాజయాన్నిఅంగీకరించారు. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటామని, ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామన్నారు కేటీఆర్, హరీశ్ రావు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి మరికాసేపట్లో ఆయన రాజ్ భవన్ కు చేరుకోనున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకునే అవకాశముంది. మరోవైపు వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా బీఆర్‌ఎస్ పరాజయాన్నిఅంగీకరించారు. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటామని, ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామన్నారు కేటీఆర్, హరీశ్ రావు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను తన ఓఎస్డీతో లేఖను పంపారు. ఆ తర్వాత తన సొంత వాహనంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.